తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలంలోని ఊళ్ల పాలెం గ్రామంలో 1988-1997 సంవత్సరాలలో స్రవంతి ట్యుటోరియల్స్ లో అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం స్థానిక కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తమ గురువులను పూలు చల్లుకుంటూ, కరతాల ధ్వనులతో వేదిక వద్దకు తీసుకొని వచ్చారు. నాడు విద్యాభ్యాసం చేసిన విద్యార్థుల పరిచయ కార్యక్రమం వారి ఉద్యోగ వివరాలను సభాముఖంగా తెలిపారు. ఈ సందర్భంగా నాడు బోధన చేసిన ఉపాధ్యాయులు తమ సందేశాలను ఇచ్చారు. పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని వారికి మోరల్ వాల్యూస్ నేర్పించాలని అన్నారు. తమ వద్ద విద్యాభ్యాసం చేసిన పలువురు ఉన్నత ఉద్యోగాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్రవంతి ట్యుటోరియల్స్ వ్యవస్థాపకులు, అధ్యాపకులైన మల్లికార్జున రావు, ఎస్ ఆదిత్య కుమార్, ఎస్ సురేష్ బాబు, ఐ వెంకటస్వామి రెడ్డి రమేష్ గారు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.