తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా దర్శి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పక్కా భవనం నిర్మాణం కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని డాక్టర్ లక్ష్మీ గారు మంత్రిని కోరారు.దీనిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అదేవిధంగా దర్శి నియోజకవర్గంలో రెవెన్యూ సిబ్బంది కొరత కారణంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ఎన్నో ఏళ్లుగా రైతుల అధీనంలో ఉన్న వేల ఎకరాల అసైన్డ్ భూములు మరియు 22-A పరిధిలో ఉన్న భూములపై సర్వేలు నిర్వహించి రైతులకు ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలని డాక్టర్ లక్ష్మీ గారు కోరారు.ఈ అంశాలపై కూడా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ లక్ష్మీ తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు “దర్శి నియోజకవర్గంలో మీరు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు” అంటూ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారిని ప్రత్యేకంగా అభినందించారు.