తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :-
పెండింగ్‌లో ఉన్న కేసుల త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, సత్వర పరిష్కారం సాధించడమే లక్ష్యంగా వై.పాలెం సీఐ గారి ఆధ్వర్యంలో సర్కిల్ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.సమావేశంలో UI (Undetected/Under Investigation) కేసులు, లోక్ అదాలత్‌కు సంబంధించిన కేసులు, పెండింగ్ కేసుల పురోగతిపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నాణ్యమైన విచారణతో త్వరితగతిన చట్టపరమైన పరిష్కారం తీసుకురావాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.అదేవిధంగా, కేసుల నిర్వహణలో సమన్వయం పెంచడం, కోర్టు సంబంధిత ప్రక్రియలను వేగవంతం చేయడం, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రజలకు త్వరిత న్యాయం అందేలా ప్రతి కేసును ప్రాధాన్యతతో తీసుకుని పనిచేయాలని సీఐ సూచించారు.