పెండింగ్ లో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు దర్యాఫ్తు వేగవంతం చేయాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో సోమవారం జిల్లా ఎస్పీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రేవ్ & నాన్, దొంగతనం, స్నాచింగ్, మిస్సింగ్, 174 Cr.P.C,రోడ్డు ఆక్సిడెంట్ కేసులపై మరియు ఇతర అంశాలపై సమీక్షించారు.ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీ గారు పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, అరెస్టులు, దర్యాప్తు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, కేసుల ఛేదన, పరిష్కారం, నేర నియంత్రణకు సంబంధించిన పలు సూచనలు చేశారు. యూఐ కేసులు తగ్గించి, పెండింగ్ కేసులు, చార్జ్‌షీట్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణపై దృష్టి పెట్టి, కన్విక్షన్ రేటును పెంచాలన్నారు.ప్రాపర్టీ, చైన్ స్నాచింగ్, దేవాలయ నేరాల జరిగినప్పుడు వెంటనే దర్యాప్తు మొదలు పెట్టాలని, సాంకేతిక పరిజ్ఘ్నంతో నిందితులను త్వరగా పట్టుకోని ప్రాపర్టీ రికవరీ శాతాన్ని పెంచాలన్నారు. చెడు మరియు నేర చరిత్ర గల వ్యక్తులపై ప్రత్యేక నిఘా మరియు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.మిస్సింగ్ కేసులలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగించి బాధితులను త్వరగా గుర్తించే చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరస్తుల ట్రాకింగ్, దొంగిలించబడిన వాహనాలను ఆధునిక సాంకేతిక వ్యవస్థ ను ఇంకా ఉపయోగించాలన్నారు. దర్యాప్తులో పారదర్శకత కోసం ఈ-సాక్ష్య యాప్ వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. జిల్లాలో గుర్తుతెలియని మృతదేహాలు, కారణం తెలియని మరణం కేసులు, అనుమానాస్పద మృతి కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని,
ఆయా కేసుల్లో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి పూర్తిస్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించాలని, ఆర్ఎఫ్ఎస్ఎల్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులను త్వరితగతిన తెప్పించుకుని పరిష్కరించాలని ఆదేశించారు.రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ ప్రమాదాలు జరగకుండా కుంభాకార దర్పణాలు, ఇంకా సైన్ బోర్డ్స్, బారికేడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆక్సిడెంట్ కు సంబంధించిన FAR, IAR &DAR రిపోర్ట్స్ ను నిర్ణిత కాలవ్యవధిలో గౌరవ MACT కోర్ట్ కు పంపించాలి.స్మార్ట్ పోలీసింగ్ సాంకేతికత అప్లికేషన్లో భాగంగా సెంట్రల్ క్రైమ్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ (CCTNS), సీసీటీవీ నిఘా, డ్రోన్ సర్వైలెన్స్ మరియు ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను సమర్థవంతంగా వినియోగించి నేరాలను ముందుగానే గుర్తించి, ప్రజలకు వేగవంతమైన మరియు పారదర్శక సేవలు అందించవచ్చని తెలిపారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగే గుర్తించి వాటిని క్లీన్ చేయించాలని, ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి, సంబంధిత నేరాలను నియంత్రించాలి. డ్రోన్ సర్వైలెన్స్ విస్తృతంగా నిర్వహించాలి. ముఖ్య ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలి. బక్రీద్‌ పండుగ వేడుకలు, కార్యక్రమాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దర్శి బాలమురళి కృష్ణ, మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ పి.శ్రీధర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, CCS ఇన్స్పెక్టర్ భీమా నాయక్,ఐటి కోర్ ఇన్స్పెక్టర్ జగదీష్, సీఐలు,ఎస్సైలు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *