తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
కందుకూరు పట్టణం దోబుగుంట వద్ద ఉన్న పొగాకు వేలంకేంద్రం వద్ద రైతు సంఘాల పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఏ గౌస్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సిఐటియు నాయకులు జీవి కొండారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులను కాపాడాలని అందుకోసం 500 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు పొగాకు కొనుగోలు కోసం సమాఖ్యstc పొగాకు బోర్డు ద్వారా కొనుగోలు చేయాలని క్వింటాకు 36 వేల రూపాయల కు తగ్గకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోర్డు సభ్యులుa సురేష్ గారు మాట్లాడుతూ పొగాకు బోర్డు అధికారులు నామమాత్రంగా బోర్డు కమిటీని ఏర్పాటు చేశారని కమిటీ సమావేశాలు హాజరు జరగటం లేదని బోర్డు అధికారులు సరైన సమాచారం కూడా ఇవ్వటం లేదని తెలిపారు సిఐటియు పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఏ గౌస్ మాట్లాడుతూ పొగాకురైతుల సమస్య పరిష్కారం కోసం జూన్ 1వ తేదీన పొగాకు బోర్డు వద్ద పొగాకు రైతుల సమస్య మీద రాయబారం జరుగుతుందని ఈ కార్యక్రమంలో జిల్లా రైతు నాయకులు పొగాకు రైతులు పాల్గొంటున్నారని ఈ కార్యక్రమంలో రైతులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కంటూ బాలకోటయ్య గారు ఉన్నాం రమణయ్య వెన్నపూస మాలాద్రి పిల్లి వెంకటేశ్వర్లు రైతులు పాల్గొన్నారు