తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
జూన్ 1, 2026 న విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని స్మార్ట్ జెన్ కళాశాల విద్యార్థి AIR* 73 వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించినారు. మండలంలోని పాకల గ్రామానికి చెందిన విద్యార్థి పులగర నితిన్ (H. N:266039214)జాతీయస్థాయిలో 73వ ర్యాంక్ సాధించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీమతి ఎన్. గీతా రాణి గారు, చైర్మన్ శ్రీ శ్రీనివాసరావు గారు, జిఎం శ్రీ హరిప్రసాద్ గారు విద్యార్థి మరియు వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరస్పాండెంట్ శ్రీమతి N. గీతా రాణి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతానికి చెందిన పేద విద్యార్థి ఇలాంటి విజయాలు సాధించటం మా కళాశాలకు ఎంతో గర్వకారణం అని తెలిపారు. మొదటి బ్యాచ్ లోనే సంచలన ఫలితాలకు కారణం మొదటి నుండి జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్ మరియు ఎంసెట్ లకు ప్రణాళిక బద్ధంగా తరగతుల నిర్వహణే కారణమని తెలిపారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థి ని మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందిని కళాశాల యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మరియు ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.