google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పామూరు పోలీసులు విరాట్ నగర్ జంక్షన్ సమీపంలో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దాడి సందర్భంగా నిందితుల వద్ద నుంచి రూ.21,350 నగదును స్వాధీనం చేసుకున్నారు. జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు వ్యక్తిగత, కుటుంబ మరియు సామాజిక జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పోలీసులు తెలిపారు.జూదం, మట్కా, క్రికెట్ బెట్టింగ్ మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలపై మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed