తొలి శుభోదయం న్యూస్ కొండేపి :-

అంగన్వాడీ బడి పిలుస్తోంది… చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాట… కొండేపి మండలంలో “అంగన్వాడీ బడి పిలుస్తోంది” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జూన్ 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రత్యేక చేర్పుల కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ, మానవహారం నిర్వహిస్తూ “అంగన్వాడీలే ముద్దు… మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట” అంటూ నినాదాలు చేశారు. మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం, ఆటపాటలతో కూడిన ప్రాథమిక విద్య, నాణ్యమైన సంరక్షణతో పాటు ఆంగ్ల విద్యా బోధన కూడా అందిస్తున్నామని తెలిపారు. చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి అంగన్వాడీలు ఎంతో దోహదపడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ రామ్మోహన్‌రావు, సెక్టార్ సూపర్వైజర్ రాణి, వెల్ఫేర్ అసిస్టెంట్ జయప్రకాశ్‌తో పాటు మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *