కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండల కేంద్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు మాజీ మంత్రివర్యులు పిఎసి సభ్యులు కొండపి నియోజకవర్గం ఇన్‌చార్జ్ ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో కందుకూరు రోడ్డు లోని వైఎస్ఆర్ బొమ్మ సెంటర్‌ వద్ద నిర్వహించిన”చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని, బాండ్లను చింపివేసి నిరసన తెలిపారు ప్రజా తీర్పును, ప్రజాస్వామ్య విలువలను అవమానపరిచిన వెన్నుపోటు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, నిజాలను ప్రజలకు తెలియజేయడానికి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు మాసనం వెంకట్రావు మండల ముఖ్య నాయకులు,వివిధ హాదాల్లో వున్న నాయకులు, గ్రామ పార్టీ వివిధ కమిటీ నాయకులు, మహిళలు,మండల అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *