తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఆహార భద్రత అధికారి శివతేజ శుక్రవారం పలు హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, కిరాణా దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తనిఖీల సందర్భంగా దుకాణదారులు తప్పనిసరిగా ఆహార భద్రత నియమాలు పాటించాలి, పరిశుభ్రత, నాణ్యత, గడువు తేదీల పట్ల ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించడం ప్రతి వ్యాపార బాధ్యత అని అధికారులు స్పష్టం చేశారు.అదేవిధంగా ఎక్కడైనా ఆహారంలో నాణ్యత లోపాలు, గడువు తీరిన ఉత్పత్తులు లేదా పరిశుభ్రత లాంటి అంశాల్లో సమస్యలు గమనించిన ప్రజలు వెంటనే ఆహార భద్రత విభాగానికి ఫిర్యాదు చేయాలి అని అధికారులు సూచించారు.ఆహార భద్రత పై ఎవరూ రాజీపడకూడదని, ఈ తరహా తనిఖీలు మరింత కఠినంగా కొనసాగనున్నాయని శివతేజ తెలిపారు