తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ఆలయాల నిర్వహణ, అభివృద్ధి కోసం ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ స్వామి వారి క్షేత్రం లో ఆలయాల లో ఏర్పాటు చేసిన హుండీ ద్వారా 8.5 లక్షలు ఆదాయం వచ్చింది. గురువారం దేవస్థాన ప్రాంగణం లో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, మండలి సభ్యులు,దేవాదాయ ధర్మాదాయ శాఖ కందుకూరు పర్యవేక్షణ అధికారి సత్యనారాయణ గుప్త, కార్యనిర్వహణ అధికారి పాతకోట కృష్ణవేణి హుండీ లెక్కింపును పర్యవేక్షించారు. ముందుగా ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీని తెరిచి లోపల వేసిన కానుకలను అర్చకులు, ఆలయ సిబ్బంది, స్వామి వారి భక్తులు హుండీ కానుకలను లెక్కించారు. ఈ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఈ సంవత్సరం జనవరి మాసం లో హుండీ ద్వారా 5.57 లక్షల ఆదాయం వచ్చిందని, గురువారం ఇప్పటి వరకు బ్రహ్మోత్సవాల సందర్భంగా ముందుగా తీసిన హుండీ ద్వారా 3 లక్షలు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హుండీ లెక్కింపులో ఆలయ అర్చకులు ఉదయగి వెంకట శేష లక్ష్మీ నారసింహా చార్యులు, ఉదయగిరి లక్ష్మి నారసింహ చార్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది బాపట్ల బ్రహ్మయ్య, స్వామి వారి భక్తులు పాల్గొన్నారు.