google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక జెడిబిఎం టౌన్ బాప్టిస్ట్ చర్చ్, శివాలయం, అంకమ్మ తల్లి దేవాలయం వద్ద ఉన్న యాచకులకు సోమిశెట్టి సీతా కుమారి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ లోకంలో అమ్మకంటే గొప్ప దైవం లేదు, అమ్మ మనల్ని విడిచి వెళ్లిపోయినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం కానీ ఆ బాధను దిగమింగుకొని అమ్మ జ్ఞాపకాలను పేదవారి ఆకలి తీర్చే అన్నదానంగా మార్చడం అక్షరాల దైవ కార్యమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చనమాల శ్రీనివాసరావు, ప్రేమ్ బాబు, శివ, మైత్రేష్, నితీష్ చరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *