తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఈ నెల 27, 28 తేదీలలో వర్చువల్ విధానంలో నిర్వహించనున్న మహానాడును విజయవంతం చేసేలా, కందుకూరు నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లు, అన్నగారి అభిమానులు అందరూ సిద్ధం కావాలని కోరుతున్నాను. కందుకూరు TDP కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి వర్చువల్ గా నిర్వహిస్తున్నాము. ఇందుకోసం నియోజకవర్గంలోని 11 క్లస్టర్ల పరిధిలో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి క్లస్టర్ నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరై మన ఐకమత్యం చాటాలి.
జగన్ మోహన్ రెడ్డి గారి మానసిక స్థితిపై మాకు అనుమానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై ఆయన చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారు. 11 సీట్లకు పరిమితం చేసినా మార్పు రాని వైసిపి నేతలకు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మరోసారి బుద్ధి చెప్పడం ఖాయం. కందుకూరు నా కంచుకోట కాదు.. అది కార్యకర్తల కోట. ప్రజల కోసం 24 గంటలు అందుబాటులో ఉంటూ, నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపడమే నా లక్ష్యం.కార్యకర్తల శ్రమ, నాయకుల కృషితో ఈ మహానాడును కందుకూరు గడ్డపై చిరస్మరణీయంగా చేద్దాం..