తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
గుడ్లూరు మండలం బసిరెడ్డిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ లో…. 10వ తరగతి పరీక్షల్లో మొదటి నాలుగు స్థానాలు సాధించిన విద్యార్థులకు, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం బహుమతులు అందజేశారు. మామిడాల ప్రేమ్ కుమార్ (571), యాళ్ల గీత (570), కుడుముల అక్షయ (568), యాళ్ల దీక్షితా రెడ్డి (566) లకు ప్రోత్సాహక బహుమతులు అందించారు.హైస్కూల్ లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మార్తాటి జనార్ధన్…. ఒక్కొక్కరికి 5వేల రూపాయలు ఖర్చు చేసి, ఈ బహుమతులు అందించగా, ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు ఆయనను అభినందించారు. విద్యార్థులను కూడా అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దామా కొండపనాయుడు, గొర్రెపాటి మధుసూదన్ రావు, జొన్నలగడ్డ వెంకటాద్రినాయుడు, రావెళ్ల సుధాకర్ రావు పాల్గొన్నారు.