ప్రశాంతంగా ఉండే ప్రకాశం జిల్లా కందుకూరు నియోజక వర్గం ఉలవపాడు రైల్వే స్టేషన్ సమీపం లో గురువారం రాత్రి విజయవాడ వైపు నుండి చెన్నై వెళ్తున్న జి టి ఎక్స్ప్రెస్ పై జరిగిన రాళ్ళ దాడి ఆందోళన కలిగిస్తుంది. ఎక్కడో చంబల్ ప్రాంతం లో వినే వార్త ఉలవపాడు రైల్వే స్టేషన్ సమీపం లో చోటు చేసుకోవడం తో రైల్వే భద్రత పై రైల్వే శాఖ, పోలీస్, ప్రజలలో ఆందోళన చోటు చేసుకుంది. విజయవాడ వైపు నుండి చెన్నై వెళ్తున్న జి టి ఎక్స్ప్రెస్ పై గుర్తు తెలియని వ్యక్తులు లోకో మోటివ్ పై రాళ్ళతో దాడి చేయడం తో రైలు విండ్ షీల్డ్ అద్దాలు పగలడమే కాకుండా అసిస్టెంట్ లోకో పైలట్ కి తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఈ సంఘటన తో రైల్వే భద్రత సిబ్బంది, సమీపం లోని ఇతర ప్రాంతాల భద్రత సిబ్బంది పోలీస్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టడం తో పాటు బాధితుడిని వైద్య చికిత్సకు పంపారు. రైలు పై జరిగిన రాళ్ళ దాడి తో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విజయవాడ చెన్నై మార్గంలో జరిగిన రాళ్ళ దాడి సంఘటన పై రైల్వే ఉన్నత అధికారులు విచారణ చేపట్టారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *