ఆక్సిడెంట్ లో మృతి చెందిన బాధిత పోలీస్ కుటుంబానికి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ (GPAI) చెక్కును గురువారం జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు అందచేసినారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు తేది 28.03.2026 న మృతి చెందిన కీర్తి శేషులు జె.వెంకట రమణయ్య, HC.453 గారి సతీమణి జె. శ్రీలక్ష్మి గారికి రూ. 20,65,000/- చెక్కును అందచేసినారు. జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యుల యోగక్షేమాలు, పిల్లల చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ రోజు అందజేసిన ఆర్థిక సహాయం ద్వారా కుటుంబానికి కొంత భరోసా కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీసు శాఖ పరంగా అందాల్సిన ఇతర ప్రయోజనాలు కూడా త్వరలోనే అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతి చెందిన సిబ్బంది కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఏదైనా సమస్య ఉన్న నేరుగా తనను కలవవచ్చునని వారి కుటుంబ సభ్యులకు జిల్ల ఎస్పీ గారు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో డిపిఓ AO రామ్మోహన్ రావు, డిపిఓ పి.సూపరింటెండెంట్ యాస్మిన్ భాను, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మేనేజర్ SV సుబ్బారావు, డీపీఓ సిబ్బంది ప్రవీణ్ పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *