google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కొండపి మండలంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ సహా పలు హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఈ నిరసన చేపట్టారు.వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర PAC సభ్యులు, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో శుక్రవారం కొండపి మండలంలోని శ్రీ పోలమ్మ తల్లి ఆలయం నుంచి పెద్దాయన వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ముందుగా పోలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీగా బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు, ప్రజా సమస్యలు, అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలపై విమర్శలు గుప్పించారు.ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గ ఆరు మండలాల అధ్యక్షులు మాసనం వెంకట్రావు, పిన్నిక శ్రీనివాసరావు, బచ్చల కోటేశ్వరరావు, చింతపల్లి హరిబాబు, ఇంకోలు సుబ్బారెడ్డి, దుద్దుగుంట మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు.అలాగే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, కార్యదర్శులు, టౌన్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *