తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-
మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, కంభం పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీ ఎ. శివ కృష్ణా రెడ్డి గారు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.గత నాలుగు రోజులలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన సుమారు 31 మందిని గిద్దలూరులోని స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ సీహెచ్. రమేష్ గారి ఎదుట హాజరుపరిచారు.విచారణ అనంతరం 30 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించగా, మరో వ్యక్తికి రూ.10,000 జరిమానాతో పాటు 15 రోజుల జైలు శిక్ష విధించారు.ఈ సందర్భంగా పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ఇది రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుందని హెచ్చరించారు. ప్రజలు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.