కందుకూరు నియోజకవర్గానికి అభివృద్ధి , పేద ప్రజలకు సంక్షేమ పథకాలను పరిచయం చేసిన మహోన్నతమైన వ్యక్తి , కార్యకర్తలకు కష్టం వచ్చిందంటే తన కష్టంగా భావించి అండగా నిలబడటం మాత్రమే తెలిసిన గొప్ప నాయకులు , కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలకు అండగా నిలుస్తూ క్యాడర్ కు ధైర్యాన్ని నింపిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం 76వ జన్మదినోత్సవం సందర్భంగా కందుకూరు పట్టణంలోని అన్న క్యాంటీన్ నందు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే ఒక ప్రకటనలో తెలిపారు. శివరాం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దివి కుటుంబం అభిమానులు అన్న క్యాంటీన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం అన్న క్యాంటీన్ నందు పేదలకు మూడు పూటల ఉచితంగా అన్న సేవతో పాటు స్వీట్లు పంపిణీ చేసినట్లు మోషే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు , అన్న క్యాంటీన్ చైర్మన్ ఉన్నం కొండలరావు , ఏఎంసి మాజీ చైర్మన్ తలపనేని వెంకటేశ్వర్లు , ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ మురారిశెట్టి వెంకట సుబ్బారావు , కందుకూరు మండలం మాజీ ఎంపీపీ పొడపాటి శ్రీనివాసరావు , ప్రముఖ కాంట్రాక్టర్ రావూరి రామకోటయ్య , విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు , తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్ , కందుకూరు నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు ముచ్చు శ్రీనివాసరావు , కందుకూరు నియోజకవర్గం ముస్లిం మైనార్టీ ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ , ప్రకాశం జిల్లా మాజీ కో ఆప్షన్ సభ్యులు షేక్ బాజీ , మాజీ కౌన్సిలర్ కొచ్చర్ల శ్రీనివాసరావు (మహర్షి శ్రీను) , మాజీ కౌన్సిలర్ బెల్లం రామ్ లాల్ , ఏఎంసి డైరెక్టర్ కొత్తూరి సుధాకర్ , శివాలయం మాజీ చైర్మన్ చితిరాల గోపాల్ , ఉలవపాడు మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు గడ్డం నవీన్ , దివి మాధవరావు , రెడ్డిమాసు నరశింగరావు , పబ్బిశెట్టి రాజా , ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ప్రచార కార్యదర్శి బత్తిన వెంకన్న , నల్లమోతు శ్రీహరి , పిన్నంరాజు ప్రభాకర్ , రాళ్లపాడు ప్రాజెక్టు పరిరక్షణ సమితి అధ్యక్షులు కాకుమాను మాధవరావు , ముప్పాళ్ళ శ్రీనివాసరావు , చేకూరి కృష్ణ , పసుపులేటి శ్రీనివాసరావు , జడ భాస్కర్ రావు , సుధాకర్ , షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *