google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కాకినాడ జిల్లా కాకినాడ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బుధవారం నాడు ఆకస్మిక తనిఖీ చేశారు. వంటగది, బాత్రూములను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. పేద విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నడూ లేని విధంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. రూ. 143 కోట్లతో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మత్తులు చేశామన్నారు. పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్న సంకల్పంతో రాష్ట్రంలోని గురుకులాల్లో ఐఐటి, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు పెంచామని తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ భాషలో శిక్షణ ఇప్పించి జర్మనీలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
పేద విద్యార్థుల విద్య, సంక్షేమంలో తమ ప్రభుత్వం రాజీపడని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *