తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
తాళ్లూరు మండలం, పొద్దుకూరిపాడు గ్రామపంచాయతీ పరిధిలోని చింతలపాలెం గ్రామంలో నిర్వహించిన శ్రీ పట్టాభిరామస్వామి, సీతాదేవి, లక్ష్మణస్వామి, ఆంజనేయస్వామి వార్ల ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులతో కలిసి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో తాళ్లూరు మండల టిడిపి అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి గారు, లేళ్ల వెంకయ్య గారు, హరిబాబు గారు, సూరారెడ్డి గారు, గ్రామ టిడిపి నాయకులు, మహిళలు మరియు భక్తులు పాల్గొన్నారు.