తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి మండలం చందలూరు గ్రామంలో MGNREGS నిధులతో చేపట్టిన పండ్ల తోటల పెంపకం కార్యక్రమాన్ని దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యాన పంటలు రైతులకు స్థిరమైన ఆదాయ వనరులని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని రైతులు ఉద్యాన పంటల సాగు వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.