google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన కామ్రేడ్ వేజండ్ల హనుమంతరావు రాత్రి 9 గం,, ల కు అనారోగ్యం తో మరణించినారు ఈ సందర్బంగా సీపీఎం పార్టీ జిల్లా, మండల, స్థానిక నాయకులు హనుమంతరావు మృత దేహానికి ఎర్ర జెండా కప్పి, పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించటం జరిగింది. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేసారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ పొందూరు గ్రామానికి సీపీఎం పార్టీ తరుపున సుదీర్ఘ కాలం( 30 సం,, లు )సర్పంచ్ గా పరిటాల కోటయ్య పనిచేస్తే ఆ పార్టీ కి హనుమంతరావు పొందూరు గ్రామంలో నాయకత్వం వహించారు అని గుర్తు చేశారు, వ్యవసాయ కూలీల సమస్య ల పరిష్కారం కోసం కృషి చేసి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యునిగా మంచి క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తగా హనుమంతరావు గుర్తింపు పొందారు అని తెలిపారు. .గ్రామ అభివృద్ధి కోసం , సీపీఎం పార్టీ అభివృద్ధి కోసం చనిపోయంతవరకు ఎర్ర జండా ను వదల కుండా పనిచేసిన హనుమంతరావు కి జోహార్లు అర్పించారు.ఈ కార్యక్రమం లో సీపీఎం సీనియర్ నాయకులు ముప్పరాజు కోటయ్య, జాల అంజయ్య, పునాటి ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎస్కె. మాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి. వి. కొండారెడ్డి, కె. ఆంజనేయులు, ఎమ్. రమేష్, ch. శ్రీనివాస్, కాలం సుబ్బారావు, కేజీ. మస్తాన్, జె. జయంతిబాబు,జి. శ్రీనివాసులు, టీ. రాము, వి. మోజెస్, వి. సింగయ్య, మల్లెల కొండయ్య వి. సుబ్బారావు, సిపిఐ(యంల్ ) పార్టీ నాయకులు డి వి ఎన్. స్వామి, పి. కోటేశ్వరరావు, పి. సుబ్బారావు, బి. శివరామకృష్ణ వీరితో పాటు టీడీపీ, వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ,….

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *