తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కనిగిరి పోలీస్ స్టేషన్లో కనిగిరి సీఐ ఆధ్వర్యంలో మైనింగ్ శాఖ అధికారులతో కలిసి గ్రానైట్ కంపెనీ యజమానులు, మేనేజర్లు మరియు రవాణా వాహనాల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గ్రానైట్ అక్రమ రవాణా, అనుమతించని (Non-Designated) మార్గాల్లో రవాణా, అధిక లోడుతో (Over Tonnage) వాహనాల నడపడం, రవాణా నిబంధనల ఉల్లంఘనలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.అధికారులు చట్టబద్ధంగా మంజూరైన మార్గాల్లోనే గ్రానైట్ రవాణా చేపట్టాలని, వాహనాల్లో అనుమతించిన పరిమితికి మించి లోడును తరలించకూడదని, మైనింగ్ మరియు రవాణా శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజల భద్రత, రహదారి సంరక్షణ మరియు అక్రమ రవాణా నివారణ కోసం పోలీసు శాఖ, మైనింగ్ శాఖ సంయుక్తంగా ఇలాంటి తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తాయని తెలిపారు.