తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చెప్పారు. శనివారం అల్లూరి సీతారామరాజు 129వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని గుంటూరు రోడ్డులో ఉన్న విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధనరావు, బి.ఎన్. విజయ్ కుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి,రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీలతో కలసి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి డా.స్వామి మాట్లాడుతూ…. సీతారామరాజు స్వగృహాన్ని తాను గత ఏడాది సందర్శించానని చెప్పారు. దానిని వారసత్వ స్మారక స్థూపంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. అదేవిధంగా భోగాపురం విమానాశ్రయానికి కూడా సీతారామరాజు పేరు ప్రభుత్వం పెట్టిందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ధైర్యంగా ముందుకుసాగిన అల్లూరి జీవితం, పోరాట స్ఫూర్తి భావితరాలకు తెలియచేయాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు.