తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒంగోలు వన్‌టౌన్ సీఐ గారి ఆధ్వర్యంలో వడ్డేపాలెం శివారులో నిర్వహించిన ఆకస్మిక దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి సందర్భంగా వారి వద్ద నుండి రూ.5,140 నగదును స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు కొనసాగిస్తారని తెలిపారు. ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీస్ హెల్ప్‌లైన్‌కు తెలియజేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.