జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ వారి సూచనల మేరకు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి క్యాలెండర్ యాక్టివిటీస్ లో భాగంగా నూతన న్యాయ సేవల శిబిరం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఏ. సత్యా నంద్ అన్నారు. శనివారం 04.07.2026 కందుకూరు పట్టణంలోని జనార్ధన స్వామి దేవాలయం ఆవరణలో చిల్డ్రన్ కోసం వినూత్న తరహాలో నిర్వహించిన న్యాయ సేవలు శిబిరాన్ని న్యాయమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ చట్ట ప్రకారం పిల్లలకు కల్పించిన హక్కులను న్యాయస్థానాలు తూచా తప్పక పాటిస్తాయని అదేవిధంగా ఎటువంటి న్యాయ సహాయం అవసరమైన అర్హత కలిగిన వారికి న్యాయ సలహాలు మరియు న్యాయ సేవలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు మరియు మండల న్యాయ సేవా అధికార కమిటీలు అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా పిల్లలకు చిన్నతనం నుండే చట్టాల పట్ల అవగాహన కలిగించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో మంచి పౌరులుగా మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సబ్ కలెక్టర్ హిమవంశీ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ నుండి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామని అదేవిధంగా న్యాయ సేవ అధికార సంస్థలు నిర్వహించే న్యాయ విజ్ఞాన సదస్సులకు విస్తృతమైన ప్రచారం కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇంచార్జ్ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ న్యాయమూర్తి సిహెచ్. వి. రామకృష్ణ కందుకూరు పట్టణ న్యాయస్థానానికి సంబంధించిన సీనియర్ సివిల్ న్యాయమూర్తి కే. కె. వి బుల్లి కృష్ణ, కందుకూరు పట్టణ డిఎస్పి బాలసుబ్రమణ్యం జూనియర్ సివిల్ న్యాయమూర్తులు దుర్గా కళ్యాణి, అన్నపూర్ణశ్రీ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ నాయుడు, న్యాయవాదులు పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అంశాలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *