తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు స్థానిక కోటారెడ్డి నగర లోని శ్రీ చైతన్య స్కూల్ లో పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మిషన్ హరితోదయ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం లో
ప్రిన్సిపాల్ మెగోమి గారు మాట్లాడుతూ మారుతున్న వాతావరణం, గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించడానికి, మానవాళి మనుగడకు,చెట్లను పెంచడం చాలా అత్యవసర విధిగా పేర్కొన్నారు..ముఖ్య అతిధిగా కందుకూరు M.E.O ‘s M.N.K శర్మ గారు,K సుబ్బారెడ్డిగారు, హాజరు అయి చెట్ల ప్రాముఖ్యత ను గూర్చి, ప్రస్తుత మానవ సమాజం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య అయిన వాతావరణ కాలుష్యo గురించి అవగాహన పెంచుతూ, సహజ వనరుల వినియోగం గూర్చి, వాటి కొరత వల్ల దేశాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు గురించి పిల్లలకు వివరిస్తూ దిశా నిర్దేశం చేశారు.. విశిష్ట అతిధిగా కృషి విజ్ఞాన కేంద్ర సైంటిస్ట్ జి ప్రసాద్ బాబు గారు హాజరు అయి, పచ్చదనం గురించి చెప్తూ ఇంటి పరిసరాల్లో ఆక్సిజన్ ను, నీడనిచ్చే చెట్లను పెంచాలని పిల్లలకు మార్గదర్శకాలను సూచించారు.. అలానే భవిష్యత్ లో అటవీ భూముల శాతం పెంచే విధంగా ప్రతి విద్యార్థి, విద్యార్థిని పాటు పడాలని ఆకాంక్షించారు..ఈ కార్యక్రమం లో ఏ జి యమ్ అంజయ్య గారు, ఆర్. ఐ అనీల్ గారు, కో ఆర్డినేటర్ జి శ్రీనివాసరావు గారు, డీన్ బ్రహ్మయ్య, సీ బ్యాచ్ ఇంచార్జ్ శివ గారు,ప్రైమరీ ఇంచార్జ్ ప్రభావతి గారు, A.O హరిబాబు గారు మరియు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *