తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
చేయి చేయి కలుపుదాం ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం అనే నినాదంతో శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి ఆధ్వర్యంలో ఈరోజు సొసైటీ సభ్యుల సహకారంతో విక్కిరాలపేట(HP) ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకములు,పలకలు, పెన్సిల్స్ మరియు బోధనా సామాగ్రిని పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ ఈ.సి.మెంబర్ కోట వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఎన్నో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వారికి అవసరమైన విద్యాసామాగ్రిని మా సంస్థ ద్వారా అందిస్తున్నామని,ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నామని,ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సేవా హృదయ రవ్వా శ్రీనివాసులు (ఎల్ ఐ సి & స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్);ఉపాధ్యాయులు బడే సాహెబ్ గార్లు పాల్గొన్నారు.బర్