ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , పోలీసులు ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన పాఠశాల బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేసి విద్యార్థుల భద్రతకు సంబంధించిన పలు కీలక అంశాలపై డ్రైవర్లు, బస్సు సిబ్బంది, యాజమాన్యాలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా బస్సులు ఎల్లప్పుడూ ఫిట్‌నెస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నిర్వహించాలని, బ్రేకులు, టైర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, అత్యవసర ద్వారాలు (Emergency Windows/Doors) సక్రమంగా పనిచేసేలా ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు.అలాగే రహదారి నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, పాఠశాల ప్రాంగణం వద్ద మరియు రద్దీ ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. విద్యార్థులు బస్సు ఎక్కే సమయంలో, దిగే సమయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా బస్సులను నిలిపివేయాలని సూచించారు.అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలించే విధానం, అత్యవసర ద్వారాల వినియోగం, ప్రమాద సమయంలో అనుసరించాల్సిన చర్యలపై డ్రైవర్లు, సిబ్బందికి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.విద్యార్థుల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావు లేదని, ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించాలని పోలీసులు స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *