విద్యార్థులు భద్రతతో, ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల పరిసరాల్లో పోలీసు నిఘాను సమర్థవంతమైన భద్రతా చర్యలు పోలీసులు చేపట్టారు.జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్కూల్, కాలేజీ ప్రారంభం మరియు ముగింపు సమయాల్లో పోలీసులు మరియు డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేయటం జరిగింది. విద్యార్థులు స్కూల్స్, కాలేజీలకు వెళ్లే సమయంలో మోటార్ సైకిళ్లు, ఆటోల్లో వేధింపులకు పాల్పడే అకతాయిలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవటం జరిగింది. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ వంటి అనుచిత చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్స్, కాలేజీల వద్ద దింపే సమయంలో పరిసర ప్రాంతాలపై కాస్త శ్రద్ధ చూపాలని, ఏవైనా అనుమానంగా అనిపిస్తే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. “విద్యార్థులు వాహనాల్లో ఎక్కే, దిగే సమయంలో డ్రైవర్, క్లీనర్ అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు దాటే సందర్భంలో విద్యార్థులను సురక్షితంగా అవతలి వైపుకు తీసుకెళ్లాలని, బస్సు,ఆటోల్లో అనుమతించిన పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించరాదని పోలీసులు సూచించారు.స్కూల్ ప్రారంభానికి ముందు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఉపాధ్యాయులు స్కూల్ పరిసరాలను కాస్త గమనిస్తే భద్రత మరింత మెరుగవుతుందని పోలీసులు తెలిపారు.అలాగే స్కూల్స్ లేదా కాలేజీల పరిసరాల్లో ఇబ్బందులు కలిగించే లేదా వేధింపులకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *