ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు మహిళలు, యువత, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో మహిళలపై నేరాల నివారణ, సైబర్ మోసాలు మరియు ఆన్‌లైన్ నేరాల నుంచి రక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, మాదకద్రవ్యాలు (డ్రగ్స్/గంజాయి) వల్ల కలిగే దుష్పరిణామాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత, మైనర్లు వాహనాలు నడపడం వల్ల ఎదురయ్యే చట్టపరమైన శిక్షలు మరియు ఇతర నేరాల నివారణపై సమగ్ర అవగాహన కల్పించారు.మహిళలు తమ భద్రతకు సంబంధించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. అలాగే సైబర్ మోసాలకు గురికాకుండా అపరిచిత లింకులు, ఓటీపీలు, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు ఎవరికీ పంచుకోవద్దని వివరించారు.అదేవిధంగా తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. సమాజంలో శాంతి, భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *