దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా సింగరాయకొండ మండలంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు.మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ నాయకత్వంలో, మండల పార్టీ అధ్యక్షులు మసనం వెంకట్రావు ఆధ్వర్యంలో సింగరాయకొండ కందుకూరు రోడ్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పంపిణీ చేశారు.అదేవిధంగా మూలాగుంటపాడు గ్రామంలో, అలాగే శానంపూడి గ్రామంలో కూడా డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఇక సింగరాయకొండ క్యాంప్ కార్యాలయంలో కూడా డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి సిబ్బందికి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *