ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా విద్యార్థుల సురక్షిత రవాణా కోసం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.దర్శి, చీమకుర్తి, పసుపుగల్లు, చౌడయ్యపాలెం, ఒంగోలు వన్‌టౌన్, ఒంగోలు తాలూకా, జరుగుమల్లి తదితర పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల బస్సులను తనిఖీ చేసి వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, బీమా, పర్మిట్లు మరియు ఇతర అవసరమైన పత్రాలను పరిశీలించారు.అలాగే పాఠశాల బస్సుల్లో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అత్యవసర ద్వారాలు (Emergency Exits), సీసీ కెమెరాలు, జీపీఎస్, భద్రతా ప్రమాణాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు.మాంటిస్సోరి స్కూల్, హర్షిణి కళాశాల, గౌతమ్ మోడల్ స్కూల్, సరస్వతి కళాశాల తదితర విద్యాసంస్థల వద్ద డ్రోన్ పర్యవేక్షణ నిర్వహించి విద్యార్థుల రాకపోకలు, ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు.ఈ సందర్భంగా డ్రైవర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, విద్యార్థులు బస్సు ఎక్కే, దిగే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన చర్యలు, అత్యవసర ద్వారాల వినియోగంపై కూడా అవగాహన కల్పించారు.విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావు లేదని, అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు, డ్రైవర్లు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ సురక్షితమైన రవాణా కల్పించాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచించారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *