జూలై 11, 12 తేదీలలో కందుకూరులో సిపిఐ జిల్లాస్థాయి కౌన్సిల్ సభ్యులు , ప్రజాసంఘాల ముఖ్య నాయకులకు రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతాయని కందుకూరు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి బి సురేష్ బాబు ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కార్యకర్తలను రాజకీయంగా, సిద్ధాంత పరంగా వారి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ శిక్షణా తరగతులు దోహదపడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, జిల్లా పార్టీ కార్యదర్శి, జిల్లా నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు. కావున పార్టీ కార్యకర్తలు, కౌన్సిల్ సభ్యులు, ప్రజాసంఘాల ముఖ్య నాయకులు పాల్గొని ఈ శిక్షణా తరగతులు జయప్రదం చేయాలని ఆయన కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *