తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :-
కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు శుక్రవారం స్థానికంగా పలువురిని పరామర్శించారు. కోవూరు శాంతినగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త దేవిరెడ్డి సురేష్ రెడ్డి గారికి ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు ఆయన నివాసానికి వెళ్లారు. సురేష్ రెడ్డి గారిని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును, వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం, ఇటీవల పాముకాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది, ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏకుల పరంధామి రెడ్డి గారిని కూడా ఎమ్మెల్యే గారు పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి యోగక్షేమాలను ఆరా తీశారు. అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే సీనియర్ నేతలకు తాము ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని, ఏ అవసరమున్నా వెంటనే సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు.