తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
టి.ఆర్. ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు కళాశాల II సెమిస్టర్ మరియు IV సెమిస్టర్ ఫలితాలను ఈరోజు విడుదల చేయడం జరిగింది. II సెమిస్టర్ నందు బిఏ 85% బీఎస్సీ 83% బీకాం 90% తో ఉత్తీర్ణత సాధించడం జరిగింది. IV సెమిస్టర్ నందు బిఏ 87% బీఎస్సి 91% బీకాం 92% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. నాలుగో సెమిస్టర్ ఫలితాల్లో టి .త్రివేణి, సిహెచ్. భవాని, కే .పరిమళ, సిహెచ్ .కార్తీక్, దాసరి రమ్య, ఎన్. జాన్ బాబు, సిహెచ్ .గాయత్రి, ఎస్.కె. సునయన , కె.శామ్యూలు అత్యద్భుత ప్రతిభ చూపించారని తెలియజేశారు. అదేవిధంగా రెండవ సెమిస్టర్ లో వి .అహల్య, ఎం. శిరీష, ఎన్ .అనూష, బి శ్రావణి, వి .రాఘవేంద్ర, జె.శ్రీనివాస్, పి .నయోమి, కే .మహేశ్వరి, ఎన్. వెంకటేశ్వర్లు, ఎల్ .మధుమతి, ఎం .మేఘన, కే .లోహిత, కే .హర్షిత, కే. సందీప్ ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపాల్ తెలియజేశారు.ఈ సందర్భంగా అధ్యాపకులను మరియు విద్యార్థులను ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవి కుమార్ అభినందించారు.
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) విద్యార్థినీ విద్యార్థులలో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీసి, వాటిని మెరుగుపరిచి వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగడానికి దోహదపడే విద్యను అందిస్తుందని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తెలియజేశారు.కందుకూరు మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులు టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన తెలియజేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, విద్యార్థినీ విద్యార్థులు వెంటనే కళాశాలలో సంప్రదించాలని తెలియజేశారు.