తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-
ఏపీ బాపట్ల మండల రెవెన్యూ శాఖలో దశాబ్దాల పాటు వీఆర్ఏగా సేవలందించిన మరుప్రోలు.కోటిరెడ్డి భౌతికకాయానికి బాపట్ల మండల తహసిల్దార్ & మేజిస్ట్రేట్ షేక్. సలీమా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కోటిరెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా ఆమె స్మరించుకున్నారు. అధికారులు, రెవెన్యూ సిబ్బంది, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.