ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు లోక్ అదాలత్ సందర్భంగా ఇరు పక్షాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సంబంధిత వివాదాలపై ఇరు పక్షాలతో విడివిడిగా మరియు సంయుక్తంగా మాట్లాడి, వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకొని పరస్పర అవగాహనతో సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకునేలా సూచనలు చేశారు.చిన్నచిన్న వివాదాలను చట్టపరమైన మార్గాలతో పాటు పరస్పర చర్చలు, రాజీ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల సమయం, ధనం ఆదా కావడంతో పాటు సామాజిక సంబంధాలు కూడా మెరుగుపడతాయని వివరించారు. ప్రజలు చట్టబద్ధమైన మార్గాలను అనుసరించి శాంతియుత పరిష్కారాలకు సహకరించాలని పోలీసులు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *