తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ఈవ్‌టీజింగ్ నివారణ మరియు మహిళలు, విద్యార్థినుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు.’స్కై ఐ’ ప్రాజెక్టు ద్వారా పాఠశాలలు, కళాశాలలు, బస్‌స్టాండ్లు, ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాలు మరియు ఇతర సున్నిత ప్రాంతాల్లో డ్రోన్‌లతో పర్యవేక్షణ చేపట్టి, అనుమానాస్పద కదలికలు, మహిళలు మరియు బాలికలను వేధించే చర్యలు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.మహిళలు, విద్యార్థినులు ఎలాంటి భయం లేకుండా తమ విద్యాసంస్థలు, కార్యాలయాలు మరియు ప్రజా ప్రదేశాలకు వెళ్లేలా సురక్షిత వాతావరణం కల్పించడం పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈవ్‌టీజింగ్, మహిళలపై వేధింపులు లేదా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.