తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దోర్నాల పోలీస్ స్టేషన్ పోలీసులు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక మహిళ పోగొట్టుకున్న నగదును సకాలంలో గుర్తించి బాధితురాలికి తిరిగి అందజేశారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వేగంగా స్పందించి విచారణ చేపట్టి, పోగొట్టుకున్న నగదును గుర్తించి బాధితురాలికి అప్పగించారు. తన నగదు తిరిగి లభించడంతో బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజలు విలువైన వస్తువులు లేదా నగదు పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని, సకాలంలో సమాచారం అందిస్తే వాటిని గుర్తించి తిరిగి అందించేందుకు పోలీసులు అన్ని విధాలుగా కృషి చేస్తారని తెలిపారు.