తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకిస్తూ జరిగే బంద్ ను స్వచ్ఛందంగా ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ ప్రకటిస్తే ప్రభుత్వ విద్యాసంస్థలు మాత్రం పోలీసులను కాపలా పెట్టడం దుర్మార్గం
SFI AISF DYFI ఐఫ్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా బంద్ ప్రకటించాల్సింది పోయి బిజేపీ కి వత్తాసు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం రానున్న స్థానిక ఎన్నికలో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం.ఈ సందర్భంగా చర్చి సెంటర్లో జరిగిన నిరసన ర్యాలీ డివైఎఫ్ఐ నాయకులు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.విద్యార్థి, యువజన సంఘాల నాయకులు AIYF జిల్లా కార్యదర్శి ప్రభాకర్, DYFI జిల్లా ఉపాధ్యక్షులు నరేంద్ర ,SFI జిల్లా ఉపాధ్యక్షులు పాండు రంగారావు,AISFజిల్లా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ పై శాంతియుతంగా బంద్ నిర్వహించారు నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ
జులై 24న వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ లో భాగంగా కనిగిరి నియోజకవర్గంలో శాంతియుతంగా చర్చి సెంటర్ సర్కిల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు “పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తే, నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారు. నీట్ లీకేజ్ వల్ల దేశవ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు తెలిపిన ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు.పోలీసులను కాపలా పెట్టుకుని బంద్ ను అడ్డుకున్న ప్రభుత్వ విద్యా సంస్థలు 2014 నుండి దేశవ్యాప్తంగా 152 పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ అంశంపై స్పందించలేదు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, ఆంధ్రప్రదేశ్ లో బాబు-జగన్-పవన్ అని ఇప్పుడు అర్థమవుతోంది. విద్యార్థుల పక్షాన నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తొత్తుగా మారి అక్రమ అరెస్టులు చేయిస్తోంది” అని నాయకులు విమర్శించారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ బంద్ కు సంఘీభావంగా పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు మీగడ వెంకటేశ్వరరెడ్డి ,CITU జిల్లా నాయకులు పీసీ కేశవరావు సంఘీభావం ప్రకటించారు .ఈ కార్యక్రమంలో SFI నాయకులు అశోక్ ,చంటి ,గణేష్ DYFI నాయకులు నెహమత్ , మనోజ్ కుమార్ మాజీ AIYF నాయకులు గులాం హుస్సేన్,ఏఐఎస్ఎఫ్ నాయకులు తహిద్, ఇఫ్రాజ్ గణేష్, సాయి, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.