మార్కాపురం జిల్లా పెద్దారవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని రాగి వైర్లను దొంగిలిస్తున్న ఘటనలపై నమోదైన కేసులను మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు గారి పర్యవేక్షణలో త్రిపురాంతకం సీఐ అసన్, పెద్దారవీడు పోలీస్ స్టేషన్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఎం. సైదుబాబు మరియు సిబ్బంది సాంకేతిక ఆధారాలతో పాటు అన్ని కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా 24.07.2026 తేదీ ఉదయం గొబ్బూరు గ్రామం సమీపంలోని ఎన్‌ఎస్ అగ్రికల్చరల్ కళాశాల వద్ద నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిల పేర్లు:

  1. పాశం యల్లయ్య తండ్రి రాజయ్య, వయస్సు 45 సం’’లు, N/o గొల్లవిడిపి గ్రామము ,ఎర్రగొండపాలెం మండలం R/o చిలకచెర్ల గ్రామము, దోర్నాల మండలం,
  2. పాలగిరి వెంకటనారాయణరెడ్డి తండ్రి వెంగళరెడ్డి , వయస్సు 44 సం’’లు, రేగుమానిపల్లి గ్రామం, పెద్దారవీడు మండలం.
  3. గంగిరెడ్డి చిన్న అంజిరెడ్డి తండ్రి పెద్ద గాలిరెడ్డి , వయస్సు 31 సం’’లు , రేగుమానిపల్లి గ్రామం, పెద్దారవీడు మండలం.
  4. కనిగిరి శివ శంకర్ తండ్రి పెద్ద వేలుగొండయ్య, వయస్సు 40, రజక బజార్, కంభం రోడ్డు, మార్కాపురం పట్టణం.

విచారణలో నిందితులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక ముఠాగా ఏర్పడి, పెద్దారవీడు, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల పరిధిలోని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి, వాటిలోని రాగి వైర్లను దొంగిలించి విక్రయించడం ద్వారా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు తెలిపారు.
తేదీ:24.07.2026న పెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామ సమీపంలోని సుంకేసుల పునరావాస కాలనీలో సుమారు మొత్తం 328 కిలోల రాగి వైరును స్వాధీనం చేసుకున్నారు. ఆయా కేసుల వివరాలు ఈ క్రింద తెలిపిన విధంగా ఉన్నాయి.

  1. Cr.No.08/2026,2) 28/2026,3) 32/2026,4) 46/2026,5) 69/2026,6) 70/2026, 7)72/2026 u/s 303(2) BNS, Sec. 136(1) (A) AP Electricity Act, Sec. 3 of PDPP Act of Peddaraveedu PS
    8). Cr.No.45/2026 u/s 303(2) BNS, Sec. 136(1) (A) AP Electricity Act, Sec. 3 of PDPP Act of Tripuranthakam PS.
    9). Cr.No.46/2026 u/s 303(2) BNS, Sec. 136(1) (A) AP Electricity Act, Sec. 3 of PDPP Act of Yerragondapalem PS.
    10). Cr.No.30/2026 u/s 303(2) BNS, Sec. 136(1) (A) AP Electricity Act, Sec. 3 of PDPP Act of Pullalacheruvu PS.పై మొత్తం 10 కేసులలో 30 ట్రాన్స్ఫార్మర్స్ కు సంబందించిన 328 కిలోల రాగి వైరును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులలో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది.ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ అసన్, పెద్దారవీడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం. సైదుబాబు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *