తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
మహాకవి, దళిత సాహిత్య యుగప్రవర్తకుడు గుర్రం జాషువా 55వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉన్న జాషువా విగ్రహానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు మరియు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గుర్రం జాషువా తన సాహిత్యం ద్వారా కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలను ప్రశ్నించి అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని నింపిన మహనీయుడని పేర్కొన్నారు. జాషువా ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకమని, సమానత్వ సమాజ నిర్మాణమే ఆయనకు నిజమైన నివాళి అని తెలిపారు.