సంయుక్త కిసాన్ మోర్చా( ఎస్ కే యం )పిలుపుమేరకు అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ కే నాంచార్లు పిలుపు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
వర్జీనియా పొగాకు రైతులు పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా( skm) పిలుపుమేరకు జూలై 29వ తేదీ జరుగు జాతీయ రహదారుల దిబ్బందనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అఖిల భారత రైతుకుల సంఘం( aikms )జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ కే నాంచార్లు రైతాంగానికి పిలుపునిచ్చారు శుక్రవారం సింగరాయకొండ లో కామ్రేడ్ కే నాంచార్లు మాట్లాడుతూ జిల్లాలో పొగాకు వేలం ప్రారంభమై 96 రోజులు దాటిందని, వంద రోజుల్లో వేలం ప్రక్రియ పూర్తి కావాలని ఇంతవరకు ఇంతవరకు 16.5% పొగాకు మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారని, 232 మిలియన్ కిలోలు పొగాకు ఉత్పత్తి అయితే ఇప్పటివరకు 38 మిలియన్ కిలోలు పుగాకు మాత్రమే కొనుగోలు చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిలో పొగాకు 200 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆదేశించిన వ్యాపారులు ముఖ్యమంత్రి ఆదేశాలను ధిక్కరించి పొగాకు ధరను తగ్గించి మరి కిలో 140 రూపాయలు 160 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, అందువలన రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారుల సిండికేట్ ను నివారించాలంటే మార్క్ ఫెడ్ ను రంగంలోకి దించి కిలోపొగాకు 36 రూపాయలకు కొనుగోలు చేయాలని, ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేయని వ్యాపారుల లైసెన్స్ రద్దు చేయాలని, లేదా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలు కేటాయించి టుబాకో బోర్డు చేత రైతుల నుంచి గిట్టుబాటు ధరకు పొగాకు కొనుగోలు చేయించాలని, లేనియెడల పొగాకు రైతుల ఆగ్రహానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు