కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం 11వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. శాస్త్రవేత్తగా అంతరిక్ష రంగంలో వెలకట్టలేని సేవలు అందించారని పలువురు నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, ముస్లిం మైనారిటీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ రఫీ, నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు షేక్ మున్నా, వార్డు అధ్యక్షులు షేక్ ఖలీల్, ఆల్ బాషా, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ అహ్మద్, ఉపాధ్యక్షుడు సయ్యద్ నసీర్, నాయకులు గౌస్ బాషా, ఖాదర్, జియావుద్దీన్, బాబు, నాగూర్, నజీర్, నాయబ్ రసూల్, ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *