తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఒంగోలు నగరంలోని 36వ డివిజన్ లోని 100వ బూత్ నందు జనార్దన్ గారు ప్రారంభించడం జరిగినది. ఈ సందర్బంగా జనార్దన్ గారు మాట్లాడుతూ కూటమి రెండేళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతోందన్నారు. సూపర్-6 హామీలు, పొందిన లబ్దిని ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. కూటమి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం పధకాలను వివరిస్తూ ప్రజలను చైతన్య పరచడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కార వేదికగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ఎంతో దోహాదపడుతుందన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి మరియు సంక్షేమం కార్యక్రమాలు నిర్వహిస్తుందని తద్వారా రాష్ట్ర ప్రజలకు లబ్ది చేకూరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు బండారు మదన్, క్లస్టర్ ఇంచార్జి పాటిబండ్ల వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షులు నల్లూరి ప్రదీప్, పార్టీ నాయకులు, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నడం జరిగినది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *