— రాష్ట్రపతి ప్రధాని గవర్నర్ ముఖ్యమంత్రిలకు పంపాలని విజ్ఞప్తి.
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
గో మాతను జాతీయ ప్రాణిగా చేయాలని కోరుతూ హిందూ సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ్ మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి కి లక్షలాది సంతకాలు కలిగిన పెన్ డ్రైవ్ మరియు వినతిపత్రం సమర్పించారు.
గో సమ్మాన్ అభియాన్లో భాగముగా విశ్వహిందూ పరిషత్ కార్యాలయం అయోధ్య భవనం వద్ద నుండి గోమాత తో కూడి విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు మార్వాడి సోదరులతో కలిసి గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ నినాదాలు చేస్తూ ర్యాలీగా ప్రకాశం భవన్ లో జిల్లా కలెక్టర్ ను కలసి పెన్ డ్రైవ్ మరియు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత విశేష సంపర్క కో కన్వీనర్ ఇనమనమెల్లూరి సీతారామయ్యా మాట్లాడుతూ గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రతి జిల్లాలో కలెక్టర్ ద్వారా గౌరవ రాష్ట్రపతి ప్రధానులకు వినతి పత్రాలు సమర్పించామని దానికి కొనసాగింపుగా వేలాదిమంది దేశ ప్రజల సంతకాలతో కూడిన పెన్ డ్రైవ్ లను జిల్లా కలెక్టర్ కి ఇచ్చామని వారు హిందూ బంధువుల ఆకాంక్షను సంబంధిత రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్లకు పంపుతామని తెలిపారన్నారు, గోమాత రక్షణ కు చట్టాలు ఎన్నో ఉన్నా అవి నామమాత్రంగానే ఉన్నాయని, రోజు వందలాది గోవులను కబేళాలకు తరలిస్తున్నారని వాని రక్షణకు జాతీయ ప్రాణిగా ప్రకటించడమే ముఖ్య రక్షణ చర్య అని తెలిపారు. సనాతన సాధు పరిషత్ జాతీయ అధ్యక్షులు, హిందూ పరిషత్ ధర్మాచార్య ప్రముఖ్ త్రిపుర భైరవేశ్వరానంద స్వామి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని, హిందువుల మనోభావాలను గుర్తిస్తూ గోమాతను రక్షించడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలిపారు.
ర్యాలీలో సంతోష్, నారాయణ సింగ్, అనిల్ కుమార్, సురేష్ కుమార్, అమీరా రామ్, మోహన్లాల్, కళ్యాణ్, భరత్ సింగ్, రాజు సింగ్, రమేష్, మధు సింగ్, సుజరం మరియు విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తునుగుంట మల్లికార్జునరావు, సనాతన సాధు సంత్ పరిషత్ జాతీయ అధ్యక్షులు త్రిపుర భైరవేశ్వరానంద స్వామి, శుభోదయానంద స్వామి, విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత విశేష సంపర్క కో కన్వీనర్ ఇనమనమెల్లూరి సీతారామయ్య, వేమూరి చక్రధర పెరుమాళ్ళు, నేరెళ్ల శ్రీనివాసరావు, సుంకు రఘు, ప్రచార ప్రముఖ్ రాధా రమణ గుప్తా జంధ్యం, ధనిశెట్టి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.