ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులచే జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోంది.ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, జూదం ఆడడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, గ్రామ శివార్లు, రహదారుల పక్క ప్రాంతాలు, చెట్లతో కూడిన ప్రదేశాలు మరియు జూదం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలపై డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.డ్రోన్ సాంకేతికత ద్వారా అనుమానాస్పద ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగా మద్యం సేవించడం, జూదం నిర్వహించడం లేదా వాటిలో పాల్గొనడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని, ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ తమ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనించిన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్‌కు లేదా అత్యవసర సేవల ద్వారా సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం కట్టుబడి ఉన్నారని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *