జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం & మార్కాపురం జిల్లాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, జూదం ఆడడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.డ్రోన్ సర్వైలెన్స్‌తో పాటు ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం నిఘా నిర్వహిస్తూ, ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు, అనుమానాస్పద ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నాయి. చట్టాన్ని ఉల్లంఘిస్తూ బహిరంగంగా మద్యం సేవించడం, జూదం నిర్వహించడం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.ప్రజల శాంతి, భద్రత, సామాజిక ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కార్యకలాపాలు ఎక్కడైనా కనిపించినట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *